బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల మానేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్హర్‌రావు మండల తహసీల్దార్ కె రవి కుమార్ సూచించారు. శనివారం తాడిచెర్ల , మల్లారం, ఆరెవాగు, పివి నగర్, వల్లెంకుంట, కుంభంపల్లి, తదితర ప్రాంతాల్లో మండల ఎంపీడీవో శ్యాంసుందర్ తో కలిసి పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.