అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వుండాలని భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణ బాబు అన్నారు. తెలుగు వారి పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా సిబ్బంది, న్యాయవాదులు రంగవల్లులతో కోర్టు ప్రాంగణాన్ని మెరిపించారు. విజేతలైన వారికి బహుమతులు అందజేశారు.