భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయాన్ని సోమవారం రాష్ట్ర హైకోర్ట్ జడ్జి రాధరాణి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అర్చక బృందం వేదమంత్రోచ్చరణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి మంగళవాయిద్యాల మధ్య ఆలయంలోకి ఆహ్వనించారు. ఆలయంలో గణపతి పూజ, స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.