జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం కొర్లకుంట గ్రామపంచాయతీ లోని చిన్న తండా, లంబాడిపల్లి, శ్రీపాద కాలనీలను గ్రామపంచాయతీగా చేయాలని ఆయా గ్రామాలకు చెందిన గ్రామస్తులు కొర్లకుంటలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం తమ వినతిని స్వీకరించి, అన్ని అర్హతలు ఉన్న తమ తండాలను కలిపి తక్షణమే గ్రామపంచాయతీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు.