గుండెపోటుతో మాజీ కార్పొరేటర్ మృతి
వరంగల్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొత్తవాడకు చెందిన మాజీ కార్పొరేటర్ యెలుగం శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయన అకస్మాత్తు మరణం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు, స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.