వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల వయోవృద్ధుల సంక్షేమ కమిటీని ఆదివారం నియమించుకున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని జాగృతి స్కూల్ వయోవృద్ధుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు అందరూ ఏకగ్రీవంగా నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా వరంగంటి మల్లయ్య, అధ్యక్షులు ఈగ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీములుక సాంబయ్యతో పాటు కమిటీని ఎన్నుకున్నారు.