Apr 06, 2025, 16:04 IST/
కేసీఆర్ పాదయాత్ర @18 ఏళ్ళు
Apr 06, 2025, 16:04 IST
ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన 'నల్లగొండ నగారా' పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తయినట్లు BRS ట్వీట్ చేసింది. 2007 ఏప్రిల్ 6 -12 వరకు వారం రోజుల పాటు నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో కేసీఆర్ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర ప్రజల్లో గొప్ప చైతన్యాన్ని రేకెత్తించింది. ఐదున్నర దశాబ్దాల సమైక్యాంధ్ర పాలకుల పాలన ఫలితంగా నల్గొండ ఫ్లోరైడ్ మహమ్మారిని ఎదుర్కొందని.. నల్గొండకు నీళ్లను తరలించి సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పాదయాత్ర చేశారు.