కరోనా ఎఫెక్ట్..ఆరుబయట చదువులు

842చూసినవారు
కరోనా ఎఫెక్ట్..ఆరుబయట చదువులు
కోవిడ్ మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో విద్య కూడా ఒకటి. కోవిడ్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఏదో కొంత విద్యకు సంబంధం తెగకుండా కొనసాగాలని ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నది. ఇవి తరగతికి అరగంట మాత్రమే ప్రసారం అవుతున్నవి. కానీ ఉపాధ్యాయులు పూర్తి సమయం పాఠశాలలో లేదా ఆ గ్రామంలో తమ విధులు నిర్వహిస్తున్నారు. ఎవరో చెప్పిన పాఠం ఆన్లైన్ లో ప్రసారం అయితే ఆ పాఠం తమ విద్యార్థులకు అనుగుణంగా తిరిగి అర్థమయ్యేలా చెప్పడం సందేహాలు నివృత్తి చేయడం వర్క్ సీట్లు పంచడం ఈ పనులన్నీ ఒక చోట కాకుండా ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి చేస్తున్నారు. తక్కువ విద్యార్థులు గల గ్రామాల్లో మాత్రం ఏదో ఒక చెట్టు కింద కూర్చుని ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తున్నారు.

పాఠశాలలకు పిల్లల్ని అనుమతించడం నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఈ రకంగా చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కోవిడ్ ఉన్నాగాని దాని భయం దాదాపు పోయింది. కొద్ది మంది ఉపాధ్యాయులకు సాధారణ బడి సమయం కంటే ఎక్కువ సమయం ఊరంతా తిరగడానికి పడుతున్నది. పిల్లలు బడికి వస్తే కోవిడ్ వస్తుంది అదే ప్రతి ఇంటికి తిరిగితే రాదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక అధికారులు ఆదేశాల ప్రకారం రకరకాల రిపోర్ట్లు తక్షణం అందించడం, పాఠశాల ఊడ్చడం, బాత్రూం లు శుభ్రం చేస్కోవడం లాంటి పనులను చక్కబెడుతూ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు కొత్త సెల్ల్ఫోన్ లు కొనివ్వడం, టీవీ లు రిపేర్ చేయించి ఇవ్వడం వంటి పనులతో దాతృత్వం చాటుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్