ప్రజాపాలన విజయోత్సవాలు సందర్బంగా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం కళాయాత్రను నిర్వహించారు. కళాకారులు ప్రజాపాలన మీద డప్పు కొడుతూ పాటలు పాడారు. తరువాత ప్రజాపాలన గురించి వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఆయా కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.