డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో సోమవారం షేక్ ఖాసీంబి (76) మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. ఆమె హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు వారు తెలిపారు. దీనితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు వ్యక్తులు సానుభూతిని తెలియజేశారు.