మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి లో శుక్రవారం విషాదం నెలకొంది. తమిళనాడుకు చెందిన వరికోత మిషన్ కిందపడి డ్రైవర్ మృతి చెందాడు. రాత్రి వరి గడ్డిలో నిద్రపోయిన డ్రైవర్ ను గమనించని మరో డ్రైవర్ గడ్డి పై నుండి హార్వెస్టర్ నడపడం తో బండి తొక్కేయడం తో మృతి చెందినట్టు గమనించారు. తనకు తెలియకుండానే తన తోటి డ్రైవర్ నీ తొక్కించేశాను అని భయంతో ఘటన స్థలం నుండి డ్రైవర్ పారిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.