ఆస్తి కోసం కన్నతల్లినే ఆనాథను చేసిన కొడుకులు
మహబూబాబాద్ జిల్లాలో కన్నతల్లినే ఆస్తి కోసం కొడుకులు ఆనాథను చేశారు. గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కొడుకులు.. ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. తల్లి నుంచి ఇల్లు, భూమి, బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేశారు. దీంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది.