మొహరం పండుగ సందర్భంగా గార్ల మండల కేంద్రములో మొహరం కమిటీ ఆధ్వర్యంలో పీరీలతో పురవీధులలో తిరుగుతూ మొహరం పండుగ బుధవారం జరుపుకొన్నారు. త్యాగాలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందని భక్తులు నమ్ముతారు. పండుగ ప్రారంభమైన నాటి నుండి గ్రామాలలో తిరుగుతూ డప్పు చప్పులతో ఈ పండుగ నిర్వహిస్తారు. అనంతరం హోమ గుండాలు వేసి మొహరం పండుగను ముగిస్తారు.