AP: దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగుల కోటాలో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న విద్యార్థులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయనుంది. దీనిపై సోమవారం సచివాలయంలో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయంతో నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు, గురుకురాల్లో ఉంటూ చదువుకుంటున్న 10 వేల మంది విద్యార్థులకు ఊరటనివ్వనుంది.