AP: ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 5 సార్లు తలపడ్డాయి. లక్నో 3, ఢిల్లీ 2 మ్యాచులు గెలిచాయి. రా.7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ చూడవచ్చు.