కేరళ శబరిమల అయ్యప్పస్వామి దేవాలయ నియమాలను పరిరక్షించుకోవాలని. సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తు ఉపవాస దీక్షను చేపట్టారు. ఈ సందర్భముగా జనగామ అయ్యప్పస్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశంలో అనేక సమస్యలు ఉండగా కేవలం హిందు ధర్మమును మాత్రమే వేలెత్తి చూపుతూ పండగలకు కూడా ఆంక్షలు విధిస్తున్న, ఈ కోర్టుకు ఇతర విషయాలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ వారు దొంగతనంగా ఇద్దరు మహిళలను ఆలయ ప్రవేశం చేయించి చరిత్ర సృష్టించాము అని చంకలు గుద్దుకుంటున్నారు కానీ చరిత్ర హిణులయ్యారు అని గుర్తించటంలేదు అన్నారు. సూటిగా హిందుధర్మం జోలికి రావద్దు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగామ అయ్యప్ప గురుస్వామి కాసోజు రాజేశ్వరాచార్యులు గుండు వెంకటరమణ, నల్లనాగుల శ్రీనివాసు వెంకటరెడ్డి, పజ్జురి లక్ష్మీనారాయణ, చుమ్మ జగన్ శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.