చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్వచ్ఛత పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత గ్రామ ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛత పరిశుభ్రతపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముగ్గుల పోటీల వలన దేశ సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించబడతాయని అన్నారు.