దేవరుప్పుల :ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన పోలీసులు

76చూసినవారు
దేవరుప్పుల :ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన పోలీసులు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో శుక్రవారం అక్రమంగా చెరువు నుండి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు దేవరుప్పుల ఎస్ ఐ సృజన్ కుమార్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్