విద్యుత్ షాక్ తో రైతు మృతి

1036చూసినవారు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
తరిగొప్పుల మండల కేంద్రంలోని అబ్దుల్ నాగారంకు చెందిన బాషబోయిన రాజు(42)కరెంట్ షాక్ తో శనివారం రోజున మరణించారు. అతను వ్యవసాయ పని నిమిత్తం అతని బావి దగ్గరికి అతని కొడుకు, తాను రోజు వారిలా వెళ్ళడం జరిగింది. పత్తి చేనులో దున్నడానికి నాగలి పైకి లేపడంతో పైన ఉన్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు నాగలికి తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనికి కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్