నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే కడియం

81చూసినవారు
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే కడియం
రహదారుల పనులు నాణ్యతతో చేపట్టాలని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, ఐటీడీఏ ఏటూరు నాగారం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారుల పనులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆధ్వర్యంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్