చేర్యాల మండల కేంద్రంలో జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. పార్టీ కార్యాలయం వద్ద మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో చేర్యాల మండల నాయకులు పాల్గొన్నారు.