కాజీపేట: శరన్నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదానం
కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో సుభాష్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ఏడవ రోజు అయిన బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మడికొండ సీఐ పుల్యాల కిషన్, మెట్టుగుట్ట చైర్మన్ రఘు చందర్, తొట్ల రాజు యాదవ్, హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, బైరి లింగమూర్తి, మద్దెల కుమార్, భాస్కర్, నార్ల గిరి రవి, రోడ్డ రాజు, మద్దెల కుమారస్వామి పాల్గొన్నారు.