కాజీపేట మండలం మడికొండ గ్రామంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా తాడెం రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఇన్ ఛార్జ్ డాక్టర్ జాడి రామరాజు హాజరై ఎస్టిమోర్చా జిల్లా కమిటీని ప్రకటించారు.