కాజీపేట మండలం మడికొండలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పోచమ్మ తల్లికి శ్రావణమాసంలో కుమ్మరి కులస్తుల చేత తొలి బోనం బుధవారం సమర్పించినారు. పూజారులు వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో కుమ్మరి కులస్తులు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో పూజలు చేసి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బుర్ర రాజేందర్ గౌడ్. నర్మెట్ట బిక్షపతి, గాండ్ల. మూల ఐలయ్య, వెంకటస్వామి, ముంజ రమేష్, తదితరులు పాల్గొన్నారు.