కాజీపేట మండలం గురువారం మడికొండ గ్రామంలో 50 సంవత్సరాల నుండి నిస్వార్ధమైన సేవలను అందిస్తు ప్రజలకు అందుబాటులో ఉండి తక్కువ ధరల్లో ఫీజులు వసూలు చేస్తూ సేవ చేస్తున్న డాక్టర్ తుమ్మ యాదగిరికి మడికొండ ప్రజలు శాలువాతో ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో కామని మల్లేశం, పొట్లబత్తిని సారంగపాణి, కన్నె మల్లేశం, నామని కుమార్ స్వామి, రామ్మోహన్, శివ, పోతరాజు ప్రకాష్ పాల్గొన్నారు.