కేసముద్రం: బీరు సీసాతో పొడుచుకొని యువకుడు మృతి
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 26న ఇనుప రాడ్, బీర్ సీసాతో పొడుచుకొని తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని యువకుడు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇంటికన్నె రైల్వే స్టేషన్లో దిగిన సదరు యువకుడు స్టేషన్ సమీపంలో తండాలో హల్చల్ చేస్తూ ఇనుపరాడ్డు, బీరు సీసాలతో పొడుచుకొని నానా హంగామా చేశాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.