TG: జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రూప్స్ పరీక్షల్లో క్వాలిఫై కాలేదని ఆకుల శృతి(27) యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శృతి పీజీ పూర్తి చేసి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోందని, ఇటీవల పరీక్షలు రాయగా.. అందులో క్వాలిఫై కాకపోవడంతో మనస్థాపం చెందిందన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూళానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.