బ్రిటన్ కంపెనీ సరఫరా చేసిన రక్షణ పరికరాలను భారత ప్రభుత్వ రంగ సంస్థ రష్యాకు మళ్లించిందనే ఆరోపణలను భారత్ ఖండించింది. బ్రిటన్‌కు చెందిన ఓ ఏరోస్పేస్ కంపెనీని భారత రక్షణ సంస్థతో ముడిపెట్టి.. ఆ రక్షణ సంస్థకు రష్యా ఆయుధ ఏజెన్సీతో సంబంధాలు ఉన్నాయంటూ 'న్యూయార్క్ టైమ్స్'లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని భారత్ ఖండించింది. ఆ నివేదిక అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని స్పష్టం చేసింది.