Mar 13, 2025, 14:03 IST/
‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ మృతి
Mar 13, 2025, 14:03 IST
AP: ‘XXX’ సబ్బు కంపెనీ అధిపతి మాణిక్కవేల్ అరుణాచలం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని అరండల్పేటలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన అరుణాచలం గుంటూరులో స్థిరపడ్డారు. ఆయన ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగు రాష్ట్రాల్లో XXX సోప్ బ్రాండ్ యొక్క ఇతర ఉత్పత్తులకు ఉన్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.