ఏటూరునాగారం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం: ఒకరికి గాయాలు

70చూసినవారు
ఏటూరునాగారం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం: ఒకరికి గాయాలు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వై జంక్షన్ వద్ద అతి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం యూటర్న్ తీసుకుంటూ ఉండగా బస్టాండు వైపు నుంచి వస్తున్న బుల్లెట్ వాహనంను ఢీకొంది. వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఎదురుగా ఆగి ఉన్న మరో టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్