తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంను జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నర్సింగాపురం గ్రామ ఇన్ ఛార్జ్ నాగశేషాద్రి సూరి ఆధ్వర్యంలో సోమవారం నర్సింగాపురం ముత్యాలమ్మ గుడి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను పీకి పరిశుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి జి. శ్రీను, కారోబార్ యాకన్న, అంగన్వాడి టీచర్లు డి. పద్మ, టి. నిర్మల, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్, సిఏలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.