నర్సింగాపురం అంగన్వాడి కేంద్రంలో పోషణ మాస ఉత్సవ కార్యక్రమం
జనగామ జిల్లా కొడకండ్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కొడకండ్ల సెక్టార్ పరిధిలోని నర్సింగాపురం అంగన్వాడి కేంద్రాలలో గురువారం అంగన్వాడి టీచర్లు డి పద్మ, టి నిర్మల ఆధ్వర్యంలో సూపర్వైజర్ పిసరళ సమక్షంలో పరిశుభ్రత, చేతులు కడగడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని ఎలా ఇవ్వాలో తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, కారోబార్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.