ఆధునికం ఆదర్శం మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ

851చూసినవారు
ఆధునికం ఆదర్శం మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ
కమిట్మెంట్ ఉంటే కర్తవ్యాన్ని ఆపడం కాలం వల్ల కూడా కాదని నిరూపించారు. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు. లొక్డౌన్, వేసవి సెలవుల్లో సైతం వీరు కర్తవ్యాన్ని మరువలేదు. ప్రపంచమంతా స్తంభించిన సమయంలో డిఈఓ సోమ శేఖర శర్మ, ఆన్లైన్ బోధన ప్రాక్టీస్ చేయించారు. ప్రత్యేకంగా రాష్టం లో ఎవరూ చేయని విధంగా మహబూబాబాద్ డీఈవో ఛానల్ ఏర్పాటు చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తన పాఠాన్ని వీడియో రూపంలో తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు కూడా తమ క్రియేటివిటీ జోడించి అనేక పాఠాలు అప్లోడ్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. రెగ్యులర్ గా జూమ్ మీటింగులు వేసవి సెలవుల్లో సైతం నిర్వహించి విద్యపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. ఆన్లైన్ బోధన చేయవలసి వస్తే రూపొందించాల్సిన వ్యూహాలు అన్ని జిల్లాల కంటే ముందుగా మహబూబాబాద్ జిల్లా డిఇఓ గారు ఉపాధ్యాయులతో చర్చిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జిల్లాలోని అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాల్సిందేనని తపనతో నిబంధనలు సులభతరం చేశారు. ఇంగ్లీష్ మీడియం బోధనలో మెలకువలు అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఆంగ్ల విద్యా బోధన నిష్ణాతుల తో ఆన్లైన్ ట్రైనింగ్ ఇప్పించారు. జనరల్ కమ్యూనికేషన్ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషులో బోధించడం ఎలా సబ్జెక్ట్ వైజ్ గా ఇంగ్లీష్ పాఠాలు రూపొందించటం వంటి అనేక కార్యక్రమాలపై పలుమార్లు జూమ్ మీటింగ్ ల ద్వారా విలువైన సూచనలు చేశారు. ఎక్కడ అలసత్వం చొరబడకుండా నిత్యం క్రియాశీలంగా ఉంచే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ డి ఓ గారు రెగ్యులర్ గా జూన్ మీటింగు నిర్వహిస్తూ ఉపాధ్యాయ వర్గాన్ని చైతన్య పరుస్తున్నారు. ఆన్లైన్ కాలంలో సైతం ఉపాధ్యాయులు రెగ్యులర్ పాఠశాల టైం టేబుల్ పాటిస్తున్నారు అంటే వీరి కమిట్మెంట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఆన్లైన్ టైం టేబుల్, డైలీమానిటరింగ్ షీట్, వీక్లీ మానిటరింగ్ షీట్, మంత్లీ మానిటరింగ్ సీట్, ఉపాధ్యాయ డైరీ, వ్యక్తిగత రికార్డ్ సీట్లు, వర్క్ షీట్ లు, ఎస్సీఈఆర్టీ వర్క్ సీట్లు,నోట్స్ కరెక్షన్,హోమ్ వర్క్ ఇవ్వడం,పాఠశాల వర్కర్స్ లేని కారణంగా బడి, బాత్రూం శుభ్రపర్చుకోవడం వంటి పనులతో తలమునకలై ఉన్నారు ఉపాద్యాయులు.

ఉపాధ్యాయులు తమ సొంత చానెల్స్ ద్వారా పాఠాలు అందించడమే కాక, వాట్సాప్ పాఠశాల గ్రూప్ ద్వారా, జూమ్ మీట్ ల ద్వారా ఆధునిక పద్ధతులన్నీ ఉపయోగిస్తూ విద్యార్థులకు అదనంగా బోధన కార్యక్రమాలు చేపడుతున్నారు.ప్రపంచం మొత్తం కరోనా, లాక్ డౌన్ వంటి పరిస్థితి లో ఉన్నప్పుడు సైతం మహబూబాబాద్ విద్యాశాఖ తన పని ఆపలేదు.అన్ లాక్ మొదలయ్యాక ఆఫ్ లైన్ కు ఆన్లైన్ జోడించి తమ కృషి కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్