మహదేవపూర్: బైక్ ను ఢీ కొట్టిన లారీ.. ఒకరి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగ్లూరు గ్రామ సమీపంలోని ఎల్ అండ్ టీ రోడ్డు సమీపంలో గురువారం ఇసుక లారీ బైక్ ని ఢీ కొట్టినది. ప్రమాదంలో బెగ్లూరు గ్రామానికి చెందిన దోమల రమేష్ అనే వ్యక్తి లారీ టైర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో మరో వ్యక్తి లక్ష్మి నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.