డోర్నకల్ మండలం ముల్కలపల్లి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో మంగళవారం అయ్యప్ప స్వాములు ఇరుముడ్లు కట్టుకొని శబరిమలైకి బయలుదేరుతున్నారు. అయ్యప్ప స్వాముల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తరువాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొని, ఒక పండుగలా మారింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.