వాజేడు మండలం చెరుకూరు - ధర్మవరం రహదారిపై ఇసుక లారీలతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వందల సంఖ్యలో ఇసుక లారీలు నిలపడంతో ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇసుక లారీల కారణంగా బస్సులు, ప్రైవేటు వాహనాలు రోడ్డు పక్కకు దిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.