వైద్య ఆరోగ్య శాఖలో గత 24 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని సోమవారం డిఎం హెచ్ఓ ఆఫీస్ ముందు సిఐటియు హనుమకొండ జిల్లా అధ్యక్షులు యాద నాయక్ డిమాండ్ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ రెండో తేదీన గత ప్రభుత్వం ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసేందుకు ఒక కమిటీ నియమించిందని కానీ ఇప్పుడు ప్రభుత్వం డిసెంబర్ 29న రాత పరీక్ష నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.