పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని ధర్నా

55చూసినవారు
పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలని ధర్నా
పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి, కార్యదర్శి గొంది రాజేష్ లు అన్నారు. సోమవారం తాడ్వాయి మండలకేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో రేంజ్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల తునికాకు కూలీలతో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తునికాకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్