మానవత్వం చాటుకున్న పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్

62చూసినవారు
మానవత్వం చాటుకున్న పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మానవత్వం చాటుకున్నారు. మండలంలో అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మంగళవారం వర్షంలో తడుస్తూ రోడ్డు పక్కన పడుకొని ఉంది. అటుగా వెళ్తున్న మహేందర్ అనే వ్యక్తి వృద్ధురాలిని చూసి ఎస్సైకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై కృష్ణ ప్రసాద్ వృద్ధురాలికి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :