బిజెపి నేతల అక్రమ అరెస్ట్ ప్రభుత్వానికి సిగ్గుచేటు: సురేందర్

77చూసినవారు
బిజెపి నేతల అక్రమ అరెస్ట్ ప్రభుత్వానికి సిగ్గుచేటు: సురేందర్
బిజేవైఎం నాయకులను అర్ధరాత్రి 12 గంటలకు అక్రమ అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ. బిజేవైఎం నాయకులను అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేశారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు.