మదర్ థెరిసా చేసిన సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి

59చూసినవారు
మదర్ థెరిసా చేసిన సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి
మదర్ థెరిసా 1950లో వాటికన్ అనుమతితో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు, పేదలు, రోగులకు సేవలందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవీ, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక, 1980లో భారతరత్న పురస్కారం ఆమెను వరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్