12 ఏళ్ల వయసులోనే సేవకు అంకితమైన మదర్ థెరిసా.. తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది. ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని పాఠశాలకు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయానీయ పరిస్థితి ఆమెను కలచివేసింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు. అనాథల కోసం మొతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు.