ఆల్బేనియా దేశానికి చెందిన స్కోప్జేలో 1910 ఆగస్టు 26వ తేదీన మదర్ థెరిసా జన్మించారు. మదర్ థెరిసా అసలు పేరు అంజెస్ గోంక్షే బోజాక్షియు. అల్బేనియన్ భాషలో అంజేజ్ అంటే పువ్వు అని అర్థం. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా.. అనారోగ్యంతో 1919లో ఆయన కన్నుమూయగా, మృత్యువుకి ముందు తండ్రి పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది.