ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ లో గురువారం మత్స్య శాఖ అధికారులు చేప పిల్లలు వదిలి పెట్టారు.
మత్స్య శాఖ అధ్వర్యంలో 11 లక్షల చేప పిల్లలను బ్యారేజ్ లో వదిలారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని వంద శాతం రాయితీ తో ఉచిత చేప పిల్లల పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.