ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క- సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవుదినం కావడం భక్తులు దూర ప్రాంతాల నుంచి తల్లుల దర్శనానికి తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.