ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బుధవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్ల గద్దెలపై పసుపు కుంకుమలు చెల్లించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గద్దెల ప్రాంగణం భక్తులతో రద్దీగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ శాఖ అధికారులు ఏర్పాట్లను చేపట్టారు.