ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని అంకన్నగూడెం గ్రామపంచాయతీలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా జేసీబితో మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయి. గురువారం సమాచారం తెలుసుకున్న వెంకటాపురం రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. మండల తహసీల్దార్ లక్ష్మీరాజయ్య ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య సిబ్బందితో కలిసి వెళ్ళి అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్న జేసీబిని వెంటనే సీజ్ చేశారు.