ములుగు జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేరూరు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు గ్రామ గ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా ఎవరూ బయటికి రావద్దని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం అందించాలని వారు తెలియజేశారు. చేపల వేటకు ఎవరు వెళ్లొద్దని హెచ్చరించారు.