ఏటూరునాగారం రామాలయంలో శ్రీరామనవమి పందిరి ముహూర్తం

63చూసినవారు
ఏటూరునాగారం రామాలయంలో శ్రీరామనవమి పందిరి ముహూర్తం
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం పందిరి ముహూర్తం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 17న శ్రీరామనవమి కల్యాణ మహోత్సవంలో భాగంగా పచ్చని పందిర్లు వేసేందుకు ఆలయ కమిటీ ఛైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో చలువ పందిర్లు వేసేందుకు ముహూర్తం చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నాగేశ్వరరావు శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్