అమెజాన్ అడవుల్లో అరుదైన తెగ.. తొలిసారి వెలుగులోకి వీడియో

79చూసినవారు
అమెజాన్ అడవుల్లోని అరుదైన తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియో తొలిసారి వెలుగులోకి వచ్చాయి. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న ఈ తెగను మాష్కో పైరోగా గుర్తించారు. సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ ఈ దృశ్యాలను విడుదల చేసింది. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే తెగల్లో ఇదే అతిపెద్దది. పెరు సమీపంలోని లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు.

సంబంధిత పోస్ట్